యముడి వాహనంతో ఆట..యమపురికి పడేది బాట

జంతువులను హింసించి రాక్షసానందం పొందుతారు అనేకమంది. నోరులేని మూగ జీవాలను కొట్టడం, వాటితో మోయలేనంత బరువును లాగించడం, బండికి కట్టి

Updated : 24 May 2020 21:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జంతువులను హింసించి రాక్షసానందం పొందుతుంటారు చాలా మంది. నోరులేని మూగ జీవాలను కొట్టడం, వాటితో మోయలేనంత బరువును లాగించడం, బండికి కట్టి పరుగులు పెట్టించడం ఇలా అనేక రూపాల్లో వాటిని హింసిస్తుంటారు. జంతు హింస నేరమని తెలిసినా మానుకోరు.

ఇలాగే ఒక దున్నపోతును బండికి కట్టి రహదారిపై పరుగులు పెట్టించారు కొందరు యువకులు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు ఆ బండిపైకి ఎక్కి దాన్ని కర్రతో అదిలిస్తూ పరుగులు పెట్టించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ దున్నపోతు రహదారికి అడ్డంగా పరిగెడుతూ బండితో సహా డివైడర్‌ను ఢీకొట్టింది. అంతే ఆ బండిపైన ఉన్న నలుగురు యువకులు ఎగిరి రోడ్డుపై పడ్డారు.

ఎదురుగా ఎలాంటి భారీ వాహనమూ రాకపోవడంతో వారంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అదే ఎదురుగా ఏదైనా లారీనో, బస్సో వచ్చి ఉంటే ఆ నలుగురు పరిస్థితి ఏమైయ్యేది. ఈ వీడియోను ఫారెస్ట్‌ అధికారి పర్వీన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. మూగజీవాలను హింసించడం మంచిది కాదని, రోడ్డుపై ఇలాంటి సాహసాలు చేస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని నెటిజన్లు మండిపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని