కేసీఆర్ దూరదృష్టితోనే... ‘రైతుబంధు’

రికార్డు సమయంలో 50.84 లక్షల మంది రైతులకు రూ.5294.53 కోట్ల రైతుబంధు సొమ్మును జమ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

Published : 22 Jun 2020 20:24 IST

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: రికార్డు సమయంలో 50.84 లక్షల మంది రైతులకు రూ.5294.53 కోట్ల రైతుబంధు సొమ్మును జమ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 16 వరకు పాస్‌బుక్‌లు వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ‘‘నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో రైతుబంధు సొమ్ము జమ చేయగలిగాం. రెండు సీజన్ల రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలకు ఇది తార్కాణం. 
రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 

కేసీఆర్  వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికే ఆదర్శం. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సోపానం. ప్రపంచంలోనే ఎక్కడా లేని మొదటి పథకం రైతుబంధు. కేసీఆర్ దూరదృష్టితోనే ఈ పథకం సాధ్యమైంది. రైతుబంధు నిధుల జమ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న వ్యవసాయ, ఆర్థిక, రెవిన్యూ, ఎన్ఐసీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు’’ అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని