‘చెరువుల సంర‌క్ష‌ణ‌లో చొర‌వ తీసుకోవాలి’’

 న‌గ‌రంలోని చెరువుల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స‌మీక్ష నిర్వహించారు.

Updated : 06 Jul 2020 23:28 IST

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పిలుపు


 

హైదరాబాద్‌: న‌గ‌రంలోని చెరువుల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స‌మీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో మిష‌న్ కాక‌తీయ కింద రూ.282 కోట్ల‌తో 19 చెరువుల‌ను అభివృద్ది చేస్తున్నామని బొంతు రామ్మోహన్‌ తెలిపారు. హ‌స్మ‌త్‌పేట గ్రామంలో ఉన్న బోయిన్ చెరువు పున‌రుర్ధర‌ణ‌, స‌మ‌గ్రాభివృద్దికి రూ. 14.45 కోట్లు మంజూరు చేసినట్లు మేయర్‌ తెలిపారు. ‘‘చెరువుల సంర‌క్ష‌ణ‌, అభివృద్దిలో కార్పొరేటర్లు చొర‌వ తీసుకోవాలి.  చెరువుల అభివృద్దికి చేప‌ట్టిన ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి. చెరువుల సంర‌క్ష‌ణ‌, అభివృద్దిలో భాగంగా హ‌రిత‌హారంలో మొక్క‌లు పెంచాలి’’ అని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని