రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి!

మేడపై ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలిక 15 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడి.. ఆరు అంగుళాల స్థలం ఉన్న రెండు గోడల సందులో ఇరుక్కుపోయింది.

Published : 01 Nov 2021 12:34 IST

ఒడిశా: మేడపై ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలిక 15 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడి.. ఆరు అంగుళాల స్థలం ఉన్న రెండు గోడల సందులో ఇరుక్కుపోయింది. ఒడిశా రాష్ట్రం కటక్‌లోని   చౌడ్‌వార్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. బాలిక అరుపులు విన్న తల్లి.. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. చుట్టుపక్కలవారు చేరుకున్నారు. సమాచారం అంది.. హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది గోడలకు రంధ్రం చేసి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చిన్నారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యకరంగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని