Telangana News: ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్.. మిగిలింది రెండు రోజులే!
ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ల ఆఫర్ త్వరలోనే ముగిసిపోనుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ల ఆఫర్ త్వరలోనే ముగిసిపోనుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్ చలాన్లను డిస్కౌంట్తో ఈనెల 31లోపు కట్టేందుకు వీలు కల్పించారు. దీనికి మరో రెండు రోజులే సమయం మిగిలి ఉంది. డిస్కౌంట్తో పెండింగ్ చలాన్లను కట్టేందుకు ఈనెల 1 నుంచి అవకాశం కల్పించారు. ఇప్పటికే చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
తొలుత సర్వర్లో ఇబ్బందులు తలెత్తినప్పటికీ క్రమంగా దాన్ని పరిష్కరించడంతో వాహనదారులు డిస్కౌంట్ ఆఫర్ను వినియోగించుకున్నారు. డిస్కౌంట్తో కట్టేందుకు మరో రెండు రోజులే గడువు ఉండటంతో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గడువు తీరిన తర్వాత భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?