Srisailam: వైభవంగా శ్రీశైలం మల్లన్న రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం మల్లన్న రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Updated : 19 Feb 2023 21:34 IST

శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర శోభితంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు శ్రీశైల పురవీధులకు తరలివచ్చారు. స్వామి అమ్మవార్ల  ఉత్సవ మూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి రథంపై అధిష్ఠించారు. జగద్గురు పీఠాధిపతి  శివాచార్య మహాస్వామి, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి, ఈవో ఎస్. లవన్న స్వామి అమ్మవార్లకు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు  సమర్పించారు. భక్తజనం శివనామస్మరణల నడుమ శ్రీగిరి పురవీధుల్లో ఆది దంపతుల రథోత్సవం రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా  కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డమరుక నాదాలు, డోలు విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని