Telangana News: వాహనదారులకు శుభవార్త... ట్రాఫిక్‌ పెండింగ్‌ చలానాలపై రాయితీ?

ట్రాఫిక్‌ చలానాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న వాహనదారులకు శుభవార్త. గత కొన్నేళ్లుగా చలాన్లు పెండింగ్‌లో ఉండటం, వాహనదారులు చెల్లించలేక చేతులెత్తేయడంతో వారి పట్ల ట్రాఫిక్‌ పోలీసులు కరుణించారు.

Updated : 18 Feb 2022 22:33 IST

హైదరాబాద్: ట్రాఫిక్‌ చలానాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న వాహనదారులకు శుభవార్త. గత కొన్నేళ్లుగా చలాన్లు పెండింగ్‌లో ఉండటం, వాహనదారులు చెల్లించలేక చేతులెత్తేయడంతో వారి పట్ల ట్రాఫిక్‌ పోలీసులు కరుణించారు. తెలంగాణలో గత 8 ఏళ్లుగా దాదాపు రూ.600 కోట్ల మేర చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దీంతో పెండింగ్‌లో ఉన్న చలాన్లు క్లియర్‌ చేసేందుకు వాటిపై రాయితీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే, చలాన్లపై ఎంత రాయితీ ఇవ్వలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. రాయితీ విషయమై చర్చించేందుకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో ఇవాళ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. భేటీలో పాల్గొన్న హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ... చలానాల రాయితీ విషయమై త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని