Viveka Murder Case: భాస్కర్ రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దు: సీబీఐ కౌంటరు దాఖలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది.

Published : 14 Sep 2023 21:32 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ ఈ నెల 4న హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో కొత్తగా పిటిషన్ వేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు 15 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఏపీ సీఎం జగన్‌కు భాస్కర్ రెడ్డి సన్నిహిత బంధువని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఇటీవల హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ను సీబీఐ గట్టిగా వ్యతిరేకించింది. భాస్కర్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని