Health News: గుండె ఆరోగ్యానికి ప్రాథమిక పరీక్షలు

గుప్పెడు గుండె పదిలంగా ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది. దానికి ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బంది పడక తప్పదు. 

Published : 25 Mar 2022 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:గుప్పెడు గుండె పదిలంగా ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది. దానికి ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బంది పడక తప్పదు. ఆ గుండె పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పరీక్షలున్నాయని వైద్యులు రమేష్‌గూడపాటి, సీనియర్‌ కార్డియాలజిస్టును అడిగి తెలుసుకుందాం. 

గుండెలో పూడిక వచ్చే ముప్పు:పొగతాగేవారు, మధుమేహం,రక్తపోటు, ఎక్కువ బరువున్నవారు,మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారి గుండెలో పూడిక వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. కొంచెం శ్రద్ధ తీసుకొంటే నివారించే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా 60 ఏళ్లలోపున్న వారికి గుండె జబ్బులు రావడం, 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా గుండెలో పూడిక వచ్చే వీలుంది.

ఏ వయసు నుంచి పరీక్షలు చేయించుకోవాలి:గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అని 25 ఏళ్లు దాటిన వారు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా నివారించుకోవడానికి వీలుంటుంది. కొంతమందికి మధుమేహం, రక్తపోటు ఉన్నట్టు తెలియకపోవచ్చు. వీటితో గుండెకు సమస్యలు రావచ్చు.

ఈసీజీ, ఎకో పరీక్షలతో పసిగట్టవచ్చా:ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్‌ కామన్‌గా చేసే పరీక్షలు. ఈసీజీలో గుండె కొట్టుకునే తీరును తెలుసుకోవచ్చు. ఎకో పరీక్ష గుండెకు సంబంధించిన అల్ట్రాసౌండ్‌ పరీక్ష ఇది. గుండె ఎలా ఉంది. దానిలోపలి భాగాలు బాగున్నాయా గుర్తించవచ్చు.

ట్రెడ్‌మిల్‌ పరీక్ష ప్రత్యేకత:గుండెలో పూడిక ఉంటే తెలుసుకునే పరీక్ష ఇది. ఈసీజీ,ఎకో నార్మల్‌ ఉండి ట్రెడ్‌మిల్‌ పరీక్ష చేస్తే గుండె జబ్బు లక్షణాలు బయట పడవచ్చు.

దొబిటమిన్ స్ట్రెస్‌ ఎకో, స్ట్రెస్‌థాలియం పరీక్ష:వయసును బట్టి కొంతమంది ట్రెడ్‌మిల్‌ మీద నడవలేరు. దొబిటమిన్‌ మందు ఇచ్చి నడిచినపుడు రక్తపోటు ఎలా పెరుగుతుందో అలా చేసే ఎకో పరీక్ష ఇది.  గుండె సరిగా పని చేస్తుందా లేదో పరిశీలిస్తాం. రేడియోఐసోటోప్‌ ఇచ్చి గుండె అన్ని భాగాలకు రక్త సరఫరా అవుతుందో లేదో పరీక్షించేదే స్ట్రెస్‌థాలియం అంటాం. 

సీటీ యాంజియోగ్రామ్, యాంజియోగ్రామ్‌ల ప్రత్యేకత:గుండె రక్త సరఫరాలో పూడికలున్నాయనే అనుమానం కలిగినపుడు, ఈసీజీ, ఎకోలో ఏమైనా మార్పులున్నా కరోనరీ యాంజియో చేస్తుంటాం. సీటీ యాంజియోగ్గ్రామ్‌లో సాధారణ సీటీ స్కాన్‌ మాదిరిగానే పరీక్ష చేస్తాం. దీనిలో కూడా గుండెలో బ్లాక్స్‌ ఉన్నాయో లేదో గుర్తించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని