Tirumala: సర్వదర్శన టోకెన్లకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లలో బారులు

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శన టోకెన్లు జారీ చేసే శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్‌ల్లోని 

Updated : 09 Apr 2022 11:08 IST

తిరుపతి: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శన టోకెన్లు జారీ చేసే తిరుపతిలోని శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్‌ల్లోని కౌంటర్ల వద్ద భక్తులు బారులుదీరారు. కరోనా తగ్గుముఖంతో సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ వచ్చింది. దీంతో భక్తులు తిరుమలకు భారీ సంఖ్యలో వస్తున్నారు.

మరోవైపు ఇవాళ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఈ నెల 12వ తేదీ నాటికి దర్శన స్లాట్‌ లభిస్తోందని తితిదే తెలిపింది. భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించమని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తితిదే కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని