సరిహద్దుల్లో రెండు తేలికపాటి హెలికాప్టర్ల మోహరింపు

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తాము తయారు చేసిన రెండు తేలికపాటి హెలికాప్టర్లను సరిహద్దుల్లోని లేహ్‌లో వైమానిక దళం మోహరించినట్లు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్(హెచ్‌ఏఎల్‌) ప్రకటించింది.

Published : 12 Aug 2020 21:58 IST

లేహ్‌: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తాము తయారు చేసిన రెండు తేలికపాటి హెలికాప్టర్లను సరిహద్దుల్లోని లేహ్‌లో వైమానిక దళం మోహరించినట్లు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌) ప్రకటించింది. లేహ్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఈ రెండు హెలికాప్టర్లు వైమానిక దళానికి సహాయకారిగా ఉంటాయని తెలిపింది. భారత భద్రతా బలగాల ప్రత్యేక అవసరాల కోసం రూపొందించిన ఈ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత తేలికపాటివని హెచ్‌ఏఎల్‌ వెల్లడించింది.

ఆత్మనిర్బర్‌ భారత్‌ కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ పాత్రకు ఈ హెలికాప్టర్లు అద్దం పడతాయని పేర్కొంది. భారత వైమానిక దళానికి చెందిన పైలెట్ల బృందం తమ పైలెట్‌తో కలిసి లేహ్‌లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఈ హెలికాప్టర్లలో విహరించి పరీక్షించినట్లు హెచ్‌ఏఎల్ తెలిపింది. అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో ల్యాండింగ్‌ కూడా చేసినట్లు వెల్లడించింది. అత్యంత శీతల వాతావరణంలో సైతం ఈ హెలికాప్టర్లను వేగంగా మోహరించినట్లు వివరించింది. శత్రు దేశానికి చెందిన ఎలాంటి లక్ష్యాన్నైనా రాత్రి, పగలు తేడా లేకుండా ఇవి కచ్చితంగా ఛేదించగలిగే ఆయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు హెచ్‌ఏఎల్‌ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని