New Dictionary Word Covirgin: కొవిడ్‌ సోకలేదా.. అయితే మీరు ‘కొవర్జిన్‌’ అట!

రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి విసురుతోన్న సవాళ్లు అన్నిఇన్ని కావు. యావత్‌ ప్రపంచాన్నే అతలాకుతలం చేసేస్తోంది. మొన్నటి వరకూ నెమ్మదించినట్టే నెమ్మదించిన కరోనా మళ్లీ పడగ విప్పింది. ఇప్పటి వరకూ కరోనా సోకకుండా జాగ్రత్తపడ్డాం.

Updated : 09 Jan 2022 19:23 IST

ఇంగ్లిష్‌ ఆన్‌లైన్‌ డిక్షనరీకి కొత్త పదం...ట్విటర్‌లో ట్రెండింగ్..

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి విసురుతోన్న సవాళ్లు అన్నిఇన్ని కావు. యావత్‌ ప్రపంచాన్నే అతలాకుతలం చేసేస్తోంది. మొన్నటి వరకూ నెమ్మదించినట్టే నెమ్మదించిన కరోనా మళ్లీ పడగ విప్పింది. ఇప్పటి వరకూ కరోనా సోకకుండా జాగ్రత్తపడ్డాం. మరి వాళ్లకంటూ ఉన్న ప్రత్యేకత అక్కడి వరకు ఆగిపోలేదు. ఏకంగా వారికంటూ ఓ ప్రత్యేక పేరు వచ్చేసింది. అదే కొవర్జిన్‌ (Covirign). ఈ రెండేళ్ల వ్యవధిలో కొవిడ్‌ సోకని వారిని కొవర్జిన్‌గా అన్నది ఆ అర్థం. ఆన్‌లైన్‌ డిక్షనరీలో ఈ పదం వాడకంలో ఉండటం విశేషం అంతే కాదు.. ట్విటర్‌లో #Covirignతో ప్రస్తుతం ట్రెండింగ్‌లోనూ ఉంది. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ డిక్షనరీకే పరిమితమైన ఈపదం హిందీ డిక్షనరీలోనూ వాడుకలో ఉంది. ఇంగ్లిష్‌ వొకాబులరీకి వచ్చిన కొత్త పదంగా నెట్టింట తెగ హల్‌ చల్ చేస్తుంది. దీనితో ఆగని నెటిజన్లు మీరు కొవిర్జన్‌ కాదా అని పోలింగ్‌ సైతం నిర్వహిస్తుండగా.. అందులో 80శాతం మేం కొవర్జిన్స్‌ అని 20శాతం కాదని తేలింది. ఇది అన్నమాట దీని ‘కొవర్జిన్‌’ వెనుక కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని