Vyooham: ‘వ్యూహం’పై హైకోర్టులో విచారణ వాయిదా
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు.
‘వ్యూహం’ ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నచ్చరని చెప్పారని లోకేశ్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి తెరవెనక ఉండి ఈ సినిమా తీయించారన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.