Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను 13 విడతల్లో వేలం వేసినట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

Updated : 24 Sep 2023 19:33 IST

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను 13 విడతల్లో వేలం వేసినట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. మొత్తం 12వేల వాహనాలకు వేలం నిర్వహించగా.. సుమారు రూ.6.75 కోట్లు వచ్చాయని వెల్లడించారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సుమారు 5,750 వాహనాలకు సంబంధించి 3 సార్లు నోటీసులు జారీ చేశామన్నారు. త్వరలో వాటికి కూడా వేలం నిర్వహిస్తాని సీపీ తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో మరో 4,500లకు పైగా వాహనాలు లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లలో ఉన్నాయని, వాటికి సంబంధించి కూడా త్వరలో నోటీసులు జారీ చేస్తామన్నారు.

వాహనాలకు సంబంధించిన వివరాలను  www.cyberabadpolice.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచామన్నారు. అభ్యంతరాలు ఉన్న వాహన యజమానులు 6నెలల కాల పరిమితిలోపు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలతో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని