Karnataka: పిచ్చుకకు సమాధి.. ఘనంగా దశదిన కర్మ

ఆ గ్రామంలో చాలా పిచ్చుకలు నివాసముంటాయి. కానీ ఆ గ్రామస్థులకు వాటిలో ఒకటి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ పిచ్చుక ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని ఇళ్ల ఆవరణలకు వచ్చేది. వారు వేసిన గింజలను తిని వెళ్లేది. దీంతో వారు ఆ పిచ్చుకపై ఎనలేని

Published : 09 Feb 2022 01:51 IST

బెంగళూరు: ఆ గ్రామంలో చాలా పిచ్చుకలు నివాసముంటాయి. కానీ ఆ గ్రామస్థులకు వాటిలో ఒకటి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ పిచ్చుక ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని ఇళ్ల ఆవరణలకు వచ్చేది. వారు వేసిన గింజలను తిని వెళ్లేది. దీంతో వారు ఆ పిచ్చుకపై ఎనలేని మమకారం పెంచుకున్నారు. ఉన్నట్టుండి అది జనవరి 26న చనిపోయింది. దీంతో గ్రామస్థులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమ ఇళ్లను ఎప్పడు పలుకరించే పిచ్చుక ఇక లేదని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో ఆ గ్రామ ప్రజలంతా కలిసి ఓ ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. దానికి మనుషుల వలే అందరూ ఒక చోట చేరి అంత్యక్రియలు చేశారు. సమాధి కట్టి తాజాగా దశదిన కర్మ జరిపించారు. ‘తిరిగి రా’ అంటూ శ్రద్ధాంజలి పోస్టర్లు వేయించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భారీ మొత్తంలో వంటలు చేయించి భోజనాలు పెట్టారు. ఈ అరుదైన ఘటన కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లా శిద్లగట్ట మండలం బసవనపట్టణ గ్రామంలో జరిగింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని