KTR: దివ్యాంగ క్రీడాకారిణి మల్లికా హందాకు కేటీఆర్‌ ఆర్థిక సాయం

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మల్లికా హందాకు తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయం చేశారు. వ్యక్తిగతంగా రూ.15 లక్షలు అందజేశారు. భవిష్యత్...

Published : 10 Jan 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మల్లికా హందాకు తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆర్థిక సాయం చేశారు. వ్యక్తిగతంగా రూ.15 లక్షలు అందజేశారు. భవిష్యత్ పోటీలకు సన్నద్ధమయ్యేందుకు ల్యాప్ టాప్‌ను కూడా అందించారు. మల్లిక హందాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు. 

దివ్యాంగ (మూగ, చెవిటి) చెస్‌ క్రీడాకారిణి అయిన మల్లిక హందా.. గతంలో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించింది. అంతర్జాతీయ డెఫ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీల్లో ఆరు పతకాలు సాధించింది. 2012 నుంచి మల్లికా.. ఏడుసార్లు జాతీయ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. పంజాబ్ ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ.. ఇటీవల ఆమె ట్విటర్లో ఓ వీడియో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని