Vijayawada: దుర్గగుడి వద్ద రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గ గుడి కేశ ఖండన శాల సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.

Updated : 11 Sep 2023 12:17 IST

ఇంద్రకీలాద్రి: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ దుర్గ గుడి కేశ ఖండన శాల సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుర్గ గుడి అధికారులు ప్రత్యేక క్రేన్‌లు తెప్పించి రోడ్డుపై పడిన కొండ రాళ్లను తొలగిస్తున్నారు. సమీపంలోని సబ్‌వేను కూడా మూసివేశారు. 

దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను ఘాట్‌ రోడ్డు వైపు కాకుండా మల్లికార్జున మండపం మెట్లమార్గం వైపు మళ్లించారు. ఈ ఘటనలో సబ్‌వే సమీపంలో నిలిపిన ఆరు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండరాళ్లు పూర్తిగా తొలగిస్తే తప్ప ట్రాఫిక్‌ పునరుద్ధరణ సాధ్యపడదని వన్‌టౌన్‌ ట్రాఫిక్‌ సీఐ సుధాకర్‌ తెలిపారు. వాహనాల రాకపోకలను కనకదుర్గ పైవంతెన నుంచి కొనసాగిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు