
TS news: మావోయిస్టు హరిభూషణ్ భార్య మృతి!
హైదరాబాద్: ఇటీవల మరణించిన మావోయిస్టు హరిభూషణ్ భార్య, మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద మృతి చెందినట్లు సమాచారం. ఈ నెల 24న ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద డీసీఎంగా ఉన్నతి పొందారు. కరోనా మహమ్మారి శారదను కుంగదీసినట్లుగా తెలుస్తోంది. శారద గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారముందని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. కరోనాబారిన పడిన మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన కోరారు. పోలీస్ శాఖ తరఫున మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.