
కూల్చివేత పనులు పరిశీలిస్తోన్న మీడియా ప్రతినిధులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులను మీడియా ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం నిమిత్తం ప్రస్తుతం సచివాలయ భవనాలను ప్రభుత్వం కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. కూల్చివేత ప్రక్రియ మీడియా సమక్షంలో జరగాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కూల్చివేత, వ్యర్థాల తొలగింపు పనుల వార్తల సేకరణకు అనుమతి లభించింది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ నేతృత్వంలో మీడియా ప్రతినిధులు కూల్చివేత పనులను పరిశీలిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.