Hyderabad: హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి: కేటీఆర్‌

హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్‌ సింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. రెండో దశ కింద నిర్మించబోయే మెట్రో విస్తరణకు నిధులు అందించాలని కోరారు.

Published : 15 Nov 2022 01:36 IST

హైదరాబాద్: హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్‌ సింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. రెండో దశ కింద నిర్మించబోయే బీహెచ్‌ఈఎల్‌-లక్డీకాపూల్‌, నాగోల్‌-ఎల్బీనగర్‌ మెట్రో విస్తరణకు నిధులు అందించాలని లేఖలో పేర్కొన్నారు. ఫేజ్‌-2 విస్తరణ పనులకు రూ.8453కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారని, దీనికోసం 2023-24 బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. మొదటి దశ కింద 69కి.మీ మేర నిర్మించిన మెట్రో విజయవంతంగా నడుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండో దశలో మొత్తం 31కి.మీ పొడవును రెండు భాగాల్లో రూపొందించారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు 26కి.మీ.పొడవుతో మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఇందులో 23 స్టేషన్లు నిర్మిస్తారు. మరోవైపు నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5కి.మీ మేర 4 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని