Navy Day: సాగర తీరంలో సాహస విన్యాసాలు.. అట్టహాసంగా నేవీ డే
నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్‌లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్ర ప్రతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరై తిలకించారు.
విశాఖపట్నం: నౌకాదళ దినోత్సవం (Navy Day) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలు తిలకించారు. ఐఎన్‌ఎస్ సింధు వీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన నౌకాదళ గీతం ఆకట్టుకుంది. భారీగా తరలివచ్చిన సందర్శకులతో ఆర్కే బీచ్ జన సంద్రంగా మారింది.
నేవీ డే హైలైట్స్...
* జెమినీ బోట్‌లోకి హెలికాప్టర్ నుంచి దిగిన మెరైన్ కమాండోలు సముద్ర జలాలపై అత్యంత వేగంగా ఒడ్డుకు దూసుకొచ్చారు. జెమినీ బోట్ నుంచి నేరుగా హెలికాప్టర్లలోకి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ అటాక్ చేసేందుకు మెరైన్ కమాండోలు గాల్లోకి లేచారు.
* నౌకాదళ కమాండో బృందం నిర్వహించిన వాస్తవ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఆహూతులను ఉత్కంఠకు గురి చేసింది.
* త్రివర్ణ పతాక రెపరెపలతో గగన వీధుల్లో హెలికాప్టర్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
* నీలి జలాలపై యుద్ధనౌకల జలాంతర్గాముల విన్యాసాలతో మెరైన్ కమాండోల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
* త్రివర్ణ ప్యారాచూట్‌లో దిగిన స్కై డైవర్ అనూప్ సింగ్ రాష్ట్రపతికి నౌకాదళ ప్రత్యేక ప్రచురణ ప్రతిని అందించి ఆవిష్కరింప జేశారు.
* సాహస విన్యాసాల కోసం ఎన్‌ఎస్ కంజీర్, కడ్మత్ నుంచి సముద్రంపై ఐఎన్‌ఎస్ దిల్లీ, ఐఎన్‌ఎస్ సహ్యాద్రి యుద్ధనౌకలు ఉపయోగించారు.
* గగన తలంలో చేతక్ హెలికాప్టర్ల సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నాలుగు యుద్ధనౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు లాండింగ్, టేకాఫ్ అవడం ఆకట్టుకున్నాయి.
* మిగ్ 29 యుద్ధ విమానాలతో గగనతలంలో విన్యాసాలు చూపరులను గగుర్పాటుకు గురిచేశాయి.
* యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ ఆకట్టుకుంది. రాత్రి వేళ సముద్రంపై విద్యుత్‌కాంతులీనుతూ యుద్ధనౌకలు అబ్బురపరిచాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య
-
World News
Miss Universe : మిస్ యూనివర్స్ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!
-
Movies News
Samantha: ఎంతోకాలం తర్వాత గాయని చిన్మయి గురించి సమంత ట్వీట్