ఈ గొర్రెల కాపరి తెలివిగా ఆలోచించాడు

కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Published : 10 Aug 2020 14:51 IST

బెంగళూరు: కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహాయక బృందాల కళ్లెదుట రకరకాల ఉద్వేగాలతో కూడిన చిత్రాలు కనిపిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రాన్నే ట్విటర్‌లో షేర్ చేశారు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) డైరెక్టర్ జనరల్ సత్య ప్రధాన్. 

‘ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కృష్టానది వరదల నుంచి ఓ గొర్రెల కాపరిని రక్షించింది. తన గొర్రెలను అక్కడే వదిలేసి రావడం అతడిని తీవ్రంగా బాధించింది. ఆ సమయంలో కూడా అతడు తెలివిగా నిర్ణయం తీసుకున్నాడు. తన గొర్రెలను అక్కడే వదిలేసి, తాను పెంచుకుంటోన్న కుక్కను మాత్రం తనతోపాటే తెచ్చుకున్నాడు. గొర్రెలు సులభంగా మేయగలవు. కానీ కుక్కకు మాత్రం అతడే అహారాన్ని అందించాల్సి ఉంటుంది. అతడికి సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం నా జ్ఞాపకాల్లో ఉండిపోతుంది’ అని ప్రధాన్ ట్వీట్ చేశారు. 

భారీ వర్షాల కారణంగా డ్యాములు నిండిన కారణంగా కర్ణాటక ప్రభుత్వం వాటి నుంచి నీటిని వదలడంతో పరివాహక గ్రామాలు జలమయమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని