Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
NHRC: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసింది.

అల్లూరి సీతారామరాజు: గిరిజన గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు పంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామంలో సుమారు 60 మంది విద్యార్థులున్నా పాఠశాల లేదంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాదాపు 6 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దాటి నడుచుకుంటూ విద్యార్థులు స్కూలుకు వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నాయి.
విద్యార్థుల బాధలు చూడలేక ఓ ఎన్జీవో సంస్థ తాత్కాలిక స్కూల్‌ను ఏర్పాటు చేసిందని వెల్లడించాయి. దీన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఎన్జీవో స్కూల్ ఏర్పాటు చేసినా టీచర్‌ను ఎందుకు కేటాయించలేదని నోటీసుల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గిరిజన గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!