Tirumala: తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్‌.. త్రుటిలో తప్పించుకున్న చిరుత

తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు.

Updated : 23 Aug 2023 13:10 IST

తిరుమల: తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. సుమారు 100 మంది సిబ్బందితో అటవీ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగించారు. అయితే ట్రాప్‌ నుంచి చిరుత, ఎలుగుబంటి త్రుటిలో తప్పించుకున్నాయి. 

చిరుత బోన్‌కు సమీపంలోనికి వచ్చి వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చి ట్రాప్‌ చేసేందుకు సిబ్బంది యత్నించగా తప్పించుకుని పారిపోయింది. చిరుత, ఎలుగుబంటిని ట్రాప్‌ చేస్తే నడక మార్గంలో వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పినట్లేనని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు