FAST FOOD: పిజ్జా, చిప్స్‌ తింటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

పిజ్జా, చిప్స్‌, పేస్ర్టీ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ అంటే ఎవరికి నోరూరదు చెప్పండి.. చూడగానే తినేయాలనేపిస్తుంది కదూ! అయితే.. ఈసారి మాత్రం అవి తినాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే.... ఇప్పటి వరకూ ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్యసమస్యలు వస్తాయనే తెలుసు.

Published : 16 Oct 2021 02:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిజ్జా, చిప్స్‌, పేస్ట్రీ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ను చూడగానే తినేయాలనేపిస్తుంది కదూ! అయితే.. ఈసారి మాత్రం అవి తినాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే.... ఇప్పటి వరకూ ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే తెలుసు. ఇప్పుడా జాబితాలోకి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. బ్రెయిన్‌, బిహేవియర్‌, ఇమ్యూనిటీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో.. హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ (నిల్వపదార్థాలు, కొవ్వు శాతం, ఆర్టిఫిషియల్‌ రంగు, ఫ్లేవర్‌ ఉండేవి) తీసుకున్నట్లే అవి మెమొరీ లాస్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని నిరూపించే ప్రయత్నంలో భాగంగా పరిశోధకులు ఎలుకలకు ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ అందించగా.. వారి మెదడుపై ప్రభావం చూపాయి. ఈ సందర్భంగా ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ సీనియర్‌ పరిశోధకులు రూత్ బారింటోస్ మాట్లాడుతూ.. ‘‘ఈ పరిణామాలన్నీ మెదడుపై చాలా త్వరగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వృద్ధులు తీసుకుంటే.. వారిలో ఆకస్మిక జ్ఞాపకశక్తి లోపంతో పాటు అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందని కనుగొన్నాం. వీటన్నింటనీ దృష్టిలో పెట్టుకొని ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పరిమితంగా తీసుకొని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ DHA అధికంగా తీసుకున్నట్లైతే ఆ సమస్యను నిరోధించవచ్చు’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని