ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డికి అంగన్వాడీల నిరసన సెగ

అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంగన్వాడీల నుంచి నిరసన సెగ తగిలింది.

Updated : 20 Jan 2024 15:04 IST

ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంగన్వాడీల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల 23న సీఎం జగన్‌ పర్యటన ఉండటంతో సభాస్థలాన్ని పరిశీలించడానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో కాన్వాయ్‌ను వెళ్లనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపుగా అరగంట పాటు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా లాగిపడేస్తూ అతికష్టం మీద మంత్రి వాహనాన్ని ముందుకు పంపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని