Kadapa: నందలూరు-రాజంపేట రైల్వే మార్గం పునరుద్ధరణ పనులు పూర్తి

భారీ వర్షాలు, వరదల ధాటికి కడప జిల్లా నందలూరు వద్ద ధ్వంసమైన రైల్వే మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు.

Published : 24 Nov 2021 20:49 IST

కడప: భారీ వర్షాలు, వరదల ధాటికి కడప జిల్లా నందలూరు వద్ద ధ్వంసమైన రైల్వే మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు. ఈ నెల 19న పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోవడంతో ఆ వరదల ధాటికి ఒకటిన్నర కిలోమీటర్ మేర రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది. నందలూరు, రాజంపేట మధ్య రెండు రైల్వేలైన్లు దెబ్బతిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించగా.. కొన్ని సర్వీసుల్ని రద్దు చేశారు. కడప నుంచి తిరుపతి, చెన్నైకి వెళ్లే మార్గం కావడంతో రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దారి.. బోసిపోయింది. సరకు, ప్రయాణికుల రవాణా నిలిచిపోవడంతో  రైల్వేకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని