Hyd Rain: నగర వాసులను పలకరించిన వరుణుడు.. పలుచోట్ల వడగళ్ల వాన

వేసవికాలంలో హైదరాబాద్‌ వాసులకు చల్లటి వార్త. మండుటెండలతో ఇబ్బందిపడుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు.

Updated : 20 Apr 2023 11:06 IST

హైదరాబాద్‌: మండుటెండలతో సతమతమవుతున్న నగర వాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో  వడగళ్ల వాన కురిసింది. నాంపల్లి, హైకోర్టు, గోషామహల్, బేగంబజార్‌, బహదూర్‌పురా తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడగా.. చంచల్‌గూడ, సైదాబాద్‌, చంపాపేట, కోఠి, అబిడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, హైదర్‌గూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వివిధ పనులపై బయటకు వెళ్లిన వాహనదారులు, పాదచారులు తడిసిముద్దయ్యారు. పలుచోట్ల రహదారులపై నీరు నిల్వడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని