Odisha Train Accident: రాజమహేంద్రవరం రావాల్సిన 21 మంది ప్రయాణికులు సురక్షితం!
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహానగా రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది.

రాజమహేంద్రవరం: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహానగా రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ రైలులో రాజమహేంద్రవరం వచ్చేందుకు 24 మంది ప్రయాణికులు ఎక్కినట్లు రైల్వే అధికారుల సమాచారం. అందులో 21 మంది సురక్షితంగా ఉన్నారని.. మరో ముగ్గురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ రైలులో ఇక్కడి ప్రయాణికులు ఎవరైనా ఉంటే, వారి బంధువులు స్థానిక రైల్వేస్టేషన్‌లోని హెల్ప్‌లైన్ నంబర్ల (08832420541, 0883-2420543)లో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
ప్రమాద ఘటన నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఈక్రమంలో రాజమహేంద్రవరం స్టేషన్‌కు ప్రయాణికులు వచ్చి వెళ్తున్నారు. దీంతో స్టేషన్‌లో రద్దీ వాతావరణం ఏర్పడింది. కొందరు ప్రయాణికులు మాత్రం రైళ్ల కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!