విమాన ప్రమాదం.. ప్రముఖుల దిగ్భ్రాంతి

కోజికోడ్‌ విమాన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కోజికోడ్‌ విమాన ప్రమాద వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు...

Updated : 08 Aug 2020 09:41 IST

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌ విమాన ప్రమాద ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ ప్రమాదం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాద వివరాలను కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను అడిగి తెలుసుకున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.


-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


కేరళలో విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. సీఎం పినరయి విజయన్‌తో ప్రధాని ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నా. 

- ప్రధాని మోదీ


కోజికోడ్‌ విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నా.

-రాహుల్‌ గాంధీ


కోజికోడ్‌ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

- కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌


కోజికోడ్‌ విమాన ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా

 

-తెదేపా అధినేత చంద్రబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని