Governor Tamilisai: ఆర్టీసీ బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్‌

తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదు.

Updated : 04 Aug 2023 12:35 IST

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్‌ తమిళిసైకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ.. ఆమె ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపించింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం బిల్లు రూపొందించింది.

ఐటీలో 27 ఏళ్లలో జరిగింది.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించాం: కేటీఆర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు