
Published : 25 May 2021 19:20 IST
Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్ర విడుదల
రాజమహేంద్రవరం: సంగం డెయిరీ ఛైర్మన్, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన వీరిద్దరికీ సోమవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని.. నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
Tags :