గొంతెమ్మ కోర్కెలు కోరట్లేదు: కడప, విశాఖలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కడపలో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు

Updated : 12 Mar 2022 12:02 IST

కడప: సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కడపలో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరించాలని వారు కోరారు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సిబ్బంది వేతనాలు పెంచాలన్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరట్లేదని కార్మికులు వివరించారు.

విశాఖలోనూ మున్సిపల్‌ ఒప్పంద కార్మికులు ధర్నా చేపట్టారు. జీవీఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన కార్మికులు డీఏతో కూడిన సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరించాలని కోరారు. ఇంజినీరింగ్‌ విభాగాల్లోని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని