TS HighCourt: సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ నిరాకరణ

మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌కు బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది.

Updated : 15 Sep 2023 11:55 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సునీల్‌ బెయిల్‌ తిరస్కరిస్తూ.. అతడి బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్‌ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెలువరించింది. హత్యకేసుతో నేరుగా సంబంధం ఉండటంతోపాటు, రెండో నిందితుడిగా ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయవద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని, ఇతర షరతులు ఏమైనా ఉన్నా వాటిని కూడా అంగీకరిస్తామని చెబుతూ.. బెయిల్‌ మంజూరు చేయాలని సునీల్‌ యాదవ్‌ తరఫు న్యాయవాది కోరారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తాజాగా సునీల్‌కు బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని