CM KCR Tour: వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం..

Updated : 04 Aug 2021 13:29 IST

వాసాలమర్రి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం.. అధికారులతో కలిసి అక్కడి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతువేదికలో 130 మందితో ఆయన సమావేశమయ్యారు.

గతంలో ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించనున్నారు. జూన్‌ 22న ఈ గ్రామంలో పర్యటించిన కేసీఆర్‌.. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసి వారితో సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేశారు. సత్వర కార్యాచరణ కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు. తాజాగా మరోసారి ఆ గ్రామంలో పర్యటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని