TS News: వాజ్‌పేయీ ప్రపంచంలోనే గొప్ప నేత: కిషన్‌రెడ్డి

మాజీ ప్రధాని వాజ్‌పేయీ ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 25 Dec 2021 14:43 IST

హైదరాబాద్‌: మాజీ ప్రధాని వాజ్‌పేయీ ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. నగరంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజాసింగ్‌, విజయశాంతి కార్యక్రమంలో పాల్గొని వాజ్‌పేయీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో సుపరిపాలన దినోత్సవావం సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వాజ్‌పేయీ జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పండగ వాతావరణంలో వాజ్‌పేయీ జయంతి వేడుకలు జరిగాయి. భవిష్యత్‌ తరాలకు వాజ్‌పేయీ గురించి తెలియజేయాలి. నవశకానికి వాజ్‌పేయీ నాంది పలికారు. ఆయన ఆశయాలను మోదీ అమలు చేస్తున్నారు’’ అని అన్నారు.

‘‘ఎన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ నియంతృత్వంగా వ్యవహరించింది. ప్రధానిగా వాజ్‌పేయీ సుపరిపాలన అందించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి 65 ఏళ్లు పనిచేశారు. పార్టీ సిద్ధాంతం, కార్యకర్తల కృషితో ప్రధాని అయ్యారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలి’’ అని బండి సంజయ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని