చదువంటే ప్రేమ.. గెలిచిందీ అమ్మ: ఆసుపత్రి నుంచి వచ్చి పరీక్ష రాసిన బాలింత

సంకల్ప బలముంటే.. సాధించే తపనుంటే.. లక్ష్యసాధనలో ఏ పరీక్ష అడ్డుకాదని నిరూపించిందో అమ్మ. రెండు రోజుల కిందటే ప్రసవమైనా పురిటి నొప్పులు భరిస్తూనే 140 కి.మీ. దాటొచ్చి చదువుపై తనకున్న ఇష్టాన్ని చాటుకుని అందరి మనసులు గెలుచుకుంది.

Updated : 26 Aug 2021 08:11 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సంకల్ప బలముంటే.. సాధించే తపనుంటే.. లక్ష్యసాధనలో ఏ పరీక్ష అడ్డుకాదని నిరూపించిందో అమ్మ. రెండు రోజుల కిందటే ప్రసవమైనా పురిటి నొప్పులు భరిస్తూనే 140 కి.మీ. దాటొచ్చి చదువుపై తనకున్న ఇష్టాన్ని చాటుకుని అందరి మనసులు గెలుచుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన నేనావత్‌ సమతకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో ప్రసవమైంది. బుధవారం ఆమెకు బీఈడీ ప్రవేశ పరీక్ష ఉండగా.. ఇంట్లో వాళ్లను ఒప్పించి 3గంటల పాటు ప్రయాణం చేసొచ్ఛి. ఎల్‌బీనగర్‌లోని పరీక్షకు హాజరైంది. జిల్లా చీఫ్‌ సూపరింటెండెంట్‌ రంగారెడ్డి, పరిశీలకులు కంభంపాటి యాదగిరి, నాగరాజు ఆమెకు సాయం చేశారు. పరీక్ష రాసేంత వరకు వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని