
Updated : 08 Oct 2021 14:51 IST
AP News: కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు
అమరావతి: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏపీలో విద్యార్థుల కదంతొక్కారు. తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ఎయిడెడ్ కళాశాలల ప్రైవేటీకరణ, ఉపకార వేతనాల మంజూరు సమస్యలపై నిరసనలు చేపట్టారు. నిరసన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. బారికేడ్లు తోసుకుని కొందరు కలెక్టరేట్ ప్రాంగణంలోకి వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు పక్కకు లాగి పడేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.. జిల్లా కలెక్టర్ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలంటూ నినాదాలు చేశారు. విజయనగరం, గుంటూరులోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Tags :