AP 10th Results: పదో తరగతి ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈరోజు సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు

Updated : 06 Aug 2021 18:57 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈరోజు సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల గ్రేడ్ల వివరాలను జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ సెలక్ట్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. గ్రేడ్లు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఛాయారతన్‌ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించి సిఫారసులు చేసిందన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజించినట్టు చెప్పారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం వాటిల్లదన్నారు. 2020లో 6.37లక్షలు, 2021లో 6.26లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి సురేష్‌ తెలిపారు. కరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని  వివరించారు.

📌  10వ తరగతి ఫలితాలు 2020

📌  10వ తరగతి ఫలితాలు 2021

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని