
Updated : 27 Nov 2021 12:50 IST
AP News: శ్రీవారి సర్వదర్శన టికెట్ల విడుదల.. 10 నిమిషాల్లో ఖాళీ!
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శన ఆన్‌లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేసింది. డిసెంబర్ నెల టికెట్లను తితిదే ఈ ఉదయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లను కేటాయిస్తున్నారు. రోజుకు 10వేల టికెట్ల చొప్పున తితిదే నెల కోటా విడుదల చేసింది. కాగా, విడుదల చేసిన 10 నిమిషాల్లో వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు ఖాళీ అయ్యాయి. రేపు ఉదయం 9గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి అద్దె గదుల కోటా టికెట్లను తితిదే విడుదల చేయనుంది.
Tags :