Teacher: వివాహం రోజూ సెలవు పెట్టని ఉపాధ్యాయుడు.. నెటిజన్ల ప్రశంసలు

ప్రముఖ కరెంట్ అఫైర్స్ ఉపాధ్యాయుడు, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ప్రియే కుమార్‌ గౌరవ్‌ తన వివాహం రోజున కూడా సెలవు తీసుకునేందుకు నిరాకరించారు.......

Published : 04 May 2022 02:18 IST

జైపుర్‌: ప్రముఖ కరెంట్ అఫైర్స్ ఉపాధ్యాయుడు, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ప్రియే కుమార్‌ గౌరవ్‌ తన వివాహం రోజున కూడా సెలవు తీసుకునేందుకు నిరాకరించి తన వృత్తికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చారు. పెళ్లి జరిగే కొద్దిసేపటివరకు కూడా విద్యార్థులకు పాఠాలు బోధించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ప్రియే కుమార్‌ గౌరవ్‌ కరెంట్ అఫైర్స్‌ బోధించడంలో నిష్ణాతులుగా పేరుగాంచారు. స్వచ్ఛంద సంస్థ టచ్ ఇండియా ట్రస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ అయిన ‘శిక్షా రథ్’లో ఆయన ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అల్వార్‌లో గౌరవ్‌ వివాహం జరిగింది. అయితే తన వివాహం రోజున కూడా ఆయన సెలవు తీసుకునేందుకు నిరాకరించారు. పెళ్లి రోజున విద్యార్థులకు పాఠాలు బోధించి వృత్తి పట్ల నిబద్ధత చాటుకున్నారు.

శిక్షా రథ్ అధికారి నిర్మల్‌ మాట్లాడుతూ.. ‘ఐదు నెలల ముందే గౌరవ్‌ తన పెళ్లి గురించి తెలియజేశారు. ఇందుకోసం 4-5 రోజుల సెలవులు తీసుకోవచ్చు. కానీ ఒక్క క్లాస్‌ను కూడా మిస్‌ చేయకూడదని ఆయన భావించారు. వివాహం రోజున కూడా పాఠాలు బోధించారు’ అని పేర్కొన్నారు. లేడీస్‌ సంగీత్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా గౌరవ్‌ తదుపరి పాఠాల కోసం సాధన చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయుడి నిబద్ధత పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని