Top Ten News @ ౫ PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Apr 2023 17:48 IST

1. నవమి అల్లర్ల ఎఫెక్ట్‌.. హనుమాన్‌ జయంతికి కేంద్రం అడ్వైజరీ
శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రేపటి (ఏప్రిల్‌ 6) హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ (MHA) ట్విటర్‌లో వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  ట్రంప్‌నకు రూ.కోటి చెల్లించండి.. శృంగార తారకు కోర్టు ఆదేశం

అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై నమోదైన అభియోగాలపై న్యూయార్క్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో ట్రంప్‌పై వేసిన పరువునష్టం కేసులో మాత్రం డేనియల్స్‌కు మరోసారి చుక్కెదురయ్యింది. కాలిఫోర్నియాలోని 9వ యూఎస్‌ సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌.. డేనియల్స్‌ వాదనను తోసిపుచ్చింది. దీంతో కోర్టు ఫీజులో భాగంగా ట్రంప్‌ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు (సుమారు రూ.కోటి) చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. రాజకీయాల్లో చేరట్లేదు.. ఆ లేఖ ఎవరు పంపారో నాకు తెలుసు: సుదీప్‌

 కన్నడ స్టార్‌ సుదీప్‌(Kiccha Sudeep) భాజపాలో చేరతారంటూ వస్తోన్న ఊహాగానాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో చేరడంలేదని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బాజపా తరఫున ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు. బుధవారం బెంగళూరులో సీఎం బసవరాజ్‌ బొమ్మైతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఈ సందర్భంగా సుదీప్‌ స్పష్టంచేశారు.  కష్ట సమయంలో తనకు సీఎం బొమ్మై అండగా నిలిచారని.. ఇప్పుడు తాను ఆయనకు మద్దతుగా నిలబడతానన్నారు. భాజపా తరఫున ప్రచారం చేస్తానని చెప్పానే తప్ప ఎక్కడ నుంచీ తాను పోటీ చేయడంలేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  ప్రశ్నపత్రాల లీక్‌.. కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నేతలు చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మంత్రి బుగ్గనకు చేదు అనుభవం

 నంద్యాల జిల్లా డోన్‌లో వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగానే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసరా చెక్కుల పంపిణీ కోసం డోన్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళల్ని తరలించారు. ఎండ బాగా ఉండటం, కూర్చోవడానికి కుర్చీలు సహా కనీస సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు ఇబ్బందిపడ్డారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా.. మంత్రి మాట్లాడుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

video:‘నాటో’లో చేరిన ఫిన్‌లాండ్‌.. రష్యాకు పెద్ద ఎదురు దెబ్బ..!

6. మెట్రోలో సీటు కోసం వివాదం..తోటి ప్రయాణికురాలిపై పెప్పర్‌ స్ప్రే చల్లిన మహిళ

మెట్రోరైల్లో సీటు కోసం తలెత్తిన వివాదంలో ఆగ్రహానికి గురైన ఓ యువతి తోటి ప్రయాణికురాలిపై పెప్పర్‌ స్ప్రే చల్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...దిల్లీ(Delhi)లోని ఓ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఒకే వరుసలో కూర్చొని సీటు కోసం గొడవపడుతున్నట్లు వీడియోలో ఉంది. ఒక మహిళ తోటి ప్రయాణికురాలిపై కోపంగా అరుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహిళ బ్యాగులో నుంచి పెప్పర్‌ స్ప్రే తీసి ప్రయాణికురాలిని బెదిరింపులకు గురిచేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. చాలా లోపాలు ఉన్నాయి.. ముంబయి ఫైనల్‌ చేరడం కష్టమే: సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌

 గత ఐపీఎల్‌(IPL) సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians).. ఈ సారి(IPL 2023) కూడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీని ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు(Royal Challengers Bangalore)పై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో పలువురు ఆ జట్టుపై ఇప్పటి నుంచే విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ(Tom Moody) కూడా ఆ జాబితాలో చేరాడు. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఈ సారి కూడా రోహిత్‌ సేన(Rohit Sharma) ఫైనల్‌కు చేరడం కష్టమని జోస్యం చెప్పాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. రూ.52 వేలకే థాయ్‌లాండ్‌ టూర్‌.. IRCTC ‘థ్రిల్లింగ్‌’ ప్యాకేజ్‌!

థ్రిల్లింగ్‌ థాయ్‌లాండ్‌’ పేరిట ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్ర మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. బిహార్‌లోని పట్నా విమానాశ్రయం నుంచి ఏప్రిల్‌ 25న టూర్‌ ప్రారంభమవుతుంది. తర్వాత వెళ్లాలనుకునేవారికి మే 26న కోల్‌కతా నుంచి కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. స్వల్ప మార్పులు మినహా ఈ రెండు ప్యాకేజీలు దాదాపు ఒకేలా ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్‌ కేంద్రాలైన కోరల్‌ ద్వీపం, పట్టయ, బ్యాంకాక్‌లో పలు సందర్శనీయ స్థలాలను వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీలోనే ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కూడా మిళితమై ఉంటాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. లోదుస్తులు.. ఆర్థిక మాంద్యం.. వీటి మధ్య ఉన్న లింకేంటి?

ఒకదేశ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి అనేక కొలమానాలు అందుబాటులో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయాదాయం, వృద్ధి రేటు, ప్రజల కొనుగోలు శక్తి.. ఇలా చాలా మార్గాల ద్వారా ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయొచ్చు. ఒక దేశం ఆర్థికంగా పురోగమిస్తుందా లేదా తిరోగమన దిశలో పయనిస్తుందా తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం. అయితే, పురుషుల లోదుస్తుల విక్రయాలు కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ (Economy) తీరుతెన్నులను బహిర్గతం చేస్తుందట. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమేనంటున్నారు నిపుణులు! మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. బ్రిటన్‌లో ఏమిటీ గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌.. వాటిపై రిషి సునాక్‌ యుద్ధం దేనికి..?

బ్రిటన్‌(Britain)లో ‘గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌’ (grooming gangs)పేరు వింటేనే బాలికల తల్లిదండ్రులు వణికిపోతారు.  తమ బిడ్డలు ఈ తోడేళ్ల చెరలో చిక్కకూడదని కోరుకుంటారు. వీటిల్లో అధికంగా బ్రిటిష్‌ పాకిస్థానీల హస్తం ఉందని తాజాగా ఆ దేశ హోం మంత్రి సుయెలా బ్రావెర్మన్‌ నేరుగా బాంబు పేల్చారు. వీరి విషయంలో రాజకీయ పార్టీలు మౌనం పాటించాయని విమర్శించారు. మరోవైపు అంతకు ముందురోజే బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) ఆ దేశంలోని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా ఈ గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ను ఉక్కుపాదంతో అణచివేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీటిపై ఓ పోలీస్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని