KTR: ప్రశ్నపత్రాల లీక్‌.. కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నేతలు చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 05 Apr 2023 15:03 IST

హైదరాబాద్‌: స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నేతలు చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

‘‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణలో వరుసగా రెండు రోజులు టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రాలు వాట్సప్‌లో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనిపై భారాస, భాజపా మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని