IPL 2023: చాలా లోపాలు ఉన్నాయి.. ముంబయి ఫైనల్‌ చేరడం కష్టమే: సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌

ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians) పేలవ ప్రదర్శనపై సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ(Tom Moody) విమర్శలు గుప్పించారు. ఆ జట్టులో చాలా లోపాలు ఉన్నాయని వెల్లడించాడు. 

Updated : 05 Apr 2023 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  గత ఐపీఎల్‌(IPL) సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians).. ఈ సారి(IPL 2023) కూడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీని ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు(Royal Challengers Bangalore)పై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో పలువురు ఆ జట్టుపై ఇప్పటి నుంచే విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ(Tom Moody) కూడా ఆ జాబితాలో చేరాడు. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఈ సారి కూడా రోహిత్‌ సేన(Rohit Sharma) ఫైనల్‌కు చేరడం కష్టమని జోస్యం చెప్పాడు.

‘ముంబయి జట్టు పేలవ ప్రదర్శనపై ఆందోళన చెందుతున్నాను. నేను ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు కూడా ఇదే చెప్పాను. వారు ఫైనల్‌ వరకు చేరుకుంటారని నేను అనుకోవడం లేదు. రోహిత్‌ సేనలో చాలా లోపాలు ఉన్నాయి. జట్టు సమతుల్యత లోపించింది. మ్యాచ్‌లో అన్ని అన్ని స్థానాల్లో మెరుగ్గా బౌలింగ్‌ చేసే దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు కరవయ్యారు.  ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలోనూ వారికి సమతుల్యత లేదు’ అని మూడీ ఓ ఛానల్‌తో ఆ జట్టు ప్రదర్శనపై విశ్లేషించాడు.

ఐదుసార్లు టైటిల్‌ విజేతగా నిలిచి ఛాంపియన్‌ జట్టుగా నిలిచిన ముంబయి ప్రదర్శన ఇటీవలి కాలంలో పేలవంగా ఉంటోంది. జట్టులో మ్యాచ్‌ విన్నర్లు ఉన్నప్పటికీ ఫలితం మాత్రం రావడం లేదు. ఇక ముంబయి తన తదుపరి మ్యాచ్‌లో చెన్నై జట్టుతో ఈ నెల 8న సొంత మైదానంలో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని