Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 28 Apr 2024 16:59 IST

1. వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు: చంద్రబాబు

తెదేపా హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో ఆయన ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలన్నారు. స్వార్థం కోసం దోపిడి చేసి మోసం చేస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. నవాబులు, సుల్తాన్‌ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన ఆయన.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనంగా ఉన్నారని అన్నారు. బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. చైనాలో ఎలాన్‌ మస్క్‌ ఆకస్మిక పర్యటన!

 టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆదివారం ఆకస్మికంగా చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్‌లో పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులతో ఆయన సమావేశం కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. విద్యుత్తు వాహనాలకు చైనా రెండో అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. వెంకటగిరిలోజగన్‌ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా

 సీఎం జగన్‌ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్‌ చేయడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పట్టణంలో పలు రోడ్లను బ్లాక్‌ చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ప్రజలను భయపెట్టి మమత గెలవాలనుకుంటున్నారు: నడ్డా

పశ్చిమబెంగాల్లోని మమతా ప్రభుత్వం ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటుందా..? అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. ఆయన సందేశ్‌ఖాలీలో ఆయుధాల స్వాధీనంపై స్పందిస్తూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో భాజపా 35 నుంచి 42 వరకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీఎంసీ మాజీ నాయకుడు షాజహాన్‌ షేక్‌ అరాచకాలకు గురైన బాధిత మహిళలకు నడ్డా సంఘీభావం తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?!

దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE) 10, 12వ తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు  మే రెండోవారం నాటికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాల విడుదలకు సంబంధించి కచ్చితమైన వివరాలను మాత్రం ఇంతవరకు బోర్డు అధికారికంగా ప్రకటించలేదు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్‌ కుమార్‌రెడ్డి

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్‌సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల ఐకాస సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్ల అంశంపై ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోందని చెప్పారు. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనన్నారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!

పోషకాల పరంగా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. క్యాల్షియం, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్‌ ఎ, బి.. ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు. అయినా కూడా మనలో చాలామంది తగినన్ని పాలు (Milk) తాగటం లేదు. పాలపై లేనిపోని అపోహలూ అపనమ్మకాలూ ఎన్నెన్నో. అందుకే పాల ప్రాముఖ్యతపై సమగ్ర కథనం మీకోసం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం: కేటీఆర్‌

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకొనే శక్తి భారాసకే ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌తో పాటు కేటీఆర్‌ పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని