icon icon icon
icon icon icon

Mamata Banerjee: ప్రజలను భయపెట్టి మమత గెలవాలనుకుంటున్నారు: నడ్డా

ప్రజలను బెదిరించి టీఎంసీ ఎన్నికలు గెలిచే అవకాశాల్లేవని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆయన సందేశ్‌ఖాలీ పరిణామాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

Published : 28 Apr 2024 15:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమబెంగాల్లోని మమతా ప్రభుత్వం ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటుందా..? అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. ఆయన సందేశ్‌ఖాలీలో ఆయుధాల స్వాధీనంపై స్పందిస్తూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో భాజపా 35 నుంచి 42 వరకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీఎంసీ మాజీ నాయకుడు షాజహాన్‌ షేక్‌ అరాచకాలకు గురైన బాధిత మహిళలకు నడ్డా సంఘీభావం తెలిపారు. షాజహాన్‌ షేక్‌ బాధితుల్లో ఒక మహిళకు లోక్‌సభ టికెట్‌ కూడా ఇచ్చామన్నారు. భయపెట్టి విజయం సాధించాలనుకుంటే మమత బెనర్జీకి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆమెకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇటీవల సందేశ్‌ఖాలీలో షాజహాన్‌కు చెందిన ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. వీటిల్లో విదేశీ తయారీ రివాల్వర్‌, ఇతర ఆయుధాలు ఉన్నాయి. జనవరిలో ఈడీపై జరిగిన దాడికి సంబంధించి ఈ సోదాలను నిర్వహించింది. ఇదే అంశంపై నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ సీబీఐ ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ తనిఖీల సందర్భంగా రాష్ట్ర పోలీసులను అనుమతించలేదని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img