Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 27 Apr 2023 09:01 IST

1. చేద్దామా..సమ్మర్‌ జాబ్‌!

అకడమిక్‌ పరీక్షలు పూర్తయ్యాయి.. వేసవి సెలవులు మొదలయ్యాయి... సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. ఏదైనా కోర్సు నేర్చుకోవడం, ఆటలాడటం ఇలా ఎవరికి తోచింది వారు చేస్తారు కదా... అయితే ఈసారి సరదాగా ఈసారి సమ్మర్‌ జాబ్‌ ట్రై చేద్దామా! దీంతో లాభాలెన్నో! అవేంటంటే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పోస్టుమార్టం నివేదికే కీలకం

నగరంలోని ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి తరువాత శవమై కనిపించిన వివాహిత శ్వేత (24) ఐదు నెలల గర్భిణి. ఏడాది క్రితం గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం పెద నడుపూరు ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జి. మణికంఠతో వివాహం అయింది.  ప్రాథమికంగా ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నప్పటికీ... మృతదేహం దొరికిన తీరుబట్టి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నేటి నుంచి 500 అదనపు స్లాట్లు.. తగ్గనున్న పాస్‌పోర్టు కష్టాలు

పైచదువులు, ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాస్‌పోర్టు కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. కరోనా సమయంలో విదేశీయానాలు రద్దవ్వడంతో కొత్తగా పాస్‌పోర్టులను ఎవరూ తీసుకోలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్లాట్‌ బుక్‌ చేస్తే 40-50 రోజుల వరకు అపాయింట్‌మెంట్‌ దొరకని పరిస్థితి నెలకొనడంలో రద్దీని తగ్గించే మార్గాలపై విదేశాంగశాఖ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్‌కే) పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ చెడ్డ ‘అంకుల్‌’కు జీవిత ఖైదు: తీర్పు ఇచ్చిన విజయవాడ పోక్సో కోర్టు

తన కుమార్తె వయసు ఉన్న బాలికను నిత్యం లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు కారకుడైన కామాంధుడికి న్యాయస్థానం శిక్ష విధించింది. రెండు నెలల పాటు నిత్యం అసభ్యకర మాటలతో ఇబ్బంది పెట్టడంతో భరించలేక అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి దూకి తనువు చాలించింది. ఈ కేసులో బాలికను లైంగిక వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నిందితుడు వినోద్‌ జైన్‌ (49)కు జీవిత ఖైదు, రూ.3లక్షల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్‌.రజిని.. బుధవారం తీర్పు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేను రాలేను.. సోదరుడి దహన సంస్కారాలు మీరే చేయండి

నేను కువైట్‌లో ఉన్నాను.. చనిపోయిన మా తమ్ముడికి నేనొక్కదానినే.. తల్లిదండ్రులు లేరు.. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు రాలేను.. మృతదేహాన్ని మున్సిపల్‌ వారికి అప్పగించండి.. లేదంటే మీరే మా తమ్ముడి అంత్యక్రియలు పూర్తి చేయండి అంటూ ఓ మహిళ బంజారాహిల్స్‌ పోలీసులను కోరింది.ఈ మేరకు మున్సిపల్‌ అధికారులకు లేఖ రాస్తామని ఎస్సై తెలిపారు. లేదంటే ఎవరైనా స్వచ్ఛంద సంస్థ నుంచి లేదా మరెవరైనా వస్తే దహన సంస్కారాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘విశాఖ ఉక్కు కోసం దీక్ష చేపడతా’

విశాఖ ఉక్కును కాపాడేందుకు దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె.ఎ.పాల్‌ తెలిపారు. గుంటూరులో పార్టీ జిల్లా కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్‌ కె.ఎ.పాల్‌ పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే విశాఖను కాపాడేందుకు తన వంతు సహాయంగా రూ.4 వేల కోట్లు ఇస్తానని చెప్పానని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి తాను డబ్బులు తీసుకొస్తానని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 24/7 ఇక నగరం నిద్రపోదు

నిత్యం ఉరుకులు పరుగుల ప్రపంచం. అందాలు.. ఆనందాలు.. సరదాలు.. విందులు, వినోదాలకు కొదవలేని మహానగరం. ప్రజల అభిరుచులు, ఆలోచనలకనుగుణంగా ప్రభుత్వం 24 గంటలపాటు దుకాణాలు, హోటళ్లు తెరిచిఉంచేలా అనుమతివ్వటం శుభపరిణామం. తెల్లవారుజామున రైలు దిగే ప్రయాణికుడు.. అర్ధరాత్రి విమానాశ్రయం నుంచి బయటకొచ్చిన విదేశీయుడు.. సామాన్యుడి నుంచి సీఈవోదాకా అన్నీ అందుబాటులో ఉండేలా నగరం మారబోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చల్లచల్లగా.. పైకప్పు విధానం!

గతంలో ఇళ్ల పైకప్పులపై చల్లదనం కోసం చెట్ల కొమ్మలు, కొబ్బరి మట్టలు, తాటికమ్మలు, మట్టిగూన పెంకులు వేసుకునేవారు. ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చల్లదనం కోసం కొత్త సాంకేతిక రీతులను అనుసరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చిన్నారుల భద్రతపై మార్గదర్శకాలేవి?

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్‌ కారు డ్రైవర్‌ అఘాయిత్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. స్పందించిన ప్రభుత్వం ఆ వెంటనే ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల భద్రతపై మార్గదర్శకాలు రూపొందించేందుకు గత నవంబరులోఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఇందులో కార్మికశాఖ, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ, పోలీసు విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యశస్వి.. భవితకు దిక్సూచి

పాఠశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాయి. తాజాగా ప్రగతి పత్రాలను కూడా అందుకున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. సెలవుల్లో చదువుకు సానబెట్టి ప్రతిభ చూపి ఉపకార వేతనం పొంది ఆర్థిక అవసరం తీర్చుకునే మంచి తరుణం ఇది. ‘పీఎం యశస్వి’ ఉపకార వేతన పథకం పేర కేంద్ర సర్కారు గతేడాదే రూపకల్పన చేసింది. యశస్వి అంటే ‘యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డు స్కీమ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా’. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని