logo

‘విశాఖ ఉక్కు కోసం దీక్ష చేపడతా’

విశాఖ ఉక్కును కాపాడేందుకు దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె.ఎ.పాల్‌ తెలిపారు.

Updated : 27 Apr 2023 06:51 IST

మాట్లాడుతున్న కె.ఎ.పాల్‌

బ్రాడీపేట(గుంటూరు), న్యూస్‌టుడే: విశాఖ ఉక్కును కాపాడేందుకు దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె.ఎ.పాల్‌ తెలిపారు. గుంటూరులో పార్టీ జిల్లా కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్‌ కె.ఎ.పాల్‌ పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే విశాఖను కాపాడేందుకు తన వంతు సహాయంగా రూ.4 వేల కోట్లు ఇస్తానని చెప్పానని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి తాను డబ్బులు తీసుకొస్తానని తెలిపారు. ప్రజాశాంతి పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీకి ప్రజల ఆదరణ మెండుగా ఉందని చెప్పారు.  భాజపా తీరుతో దేశ ప్రజలు విసిగిపోయారన్నారు. దేశంలో అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని పాలకులు అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లారని విమర్శించారు. తనకు అవకాశం కల్పిస్తే రెండు తెలుగు రాష్ట్రాల అప్పులు తీర్చి, రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ప్రతి గ్రామానికి రూ.కోటి నిధిని కేటాయిస్తానన్నారు. పార్టీని ప్రజలే నడిపించాలని, అందుకే తాను ప్రజలను విరాళం అడుగుతున్నానని వివరించారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా చుక్కా వాల్టర్‌, దాసరి ప్రభుదాస్‌, కార్యదర్శిగా బూసి ప్రసాద్‌, కోశాధికారిగా పి.పోతురాజు, సభ్యులుగా ఆనంద్‌, రామంజనేయులు, దత్తు, అక్బర్‌, జార్జ్‌ విల్సన్‌, ప్రవీణ్, మ్యాథ్యూస్‌, సోనులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు