Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Apr 2023 13:18 IST

1. ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం?: బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించే దమ్ముందా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్‌ ఆయన.. కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం?పేపర్‌ లీక్‌తో సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా. నేను కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్న సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?సీపీ చెప్పింది నిజమైతే తన మూడు సింహాల టోపీపై ప్రమాణం చేసి చెప్పాలి’’ అని సంజయ్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో మళ్లీ సైకో పాలన వస్తే.. ప్రజలు వలసపోవాల్సిందే: నందమూరి బాలకృష్ణ

వైకాపా పాలనలో ఏపీ సర్వనాశనమైందని తెదేపా ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. మార్తాడులోని క్యాంప్‌ సైట్‌ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  సైలెంట్‌గా ఓటీటీలోకి ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

‘రంగమార్తాండ’ (Ranga Marthaanda).. ఆరేళ్ల  గ్యాప్‌ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన చిత్రమిది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిందీ చిత్రం. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమా.. ఎలాంటి ప్రచారం లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వరుస సెలవులు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 3 రోజుల వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే సర్వ దర్శనం కోసం టోకెన్లు లేకుండా భక్తులు చేరుకున్నారు. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దీంతో క్యూలైన్‌ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భాజపాలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌  సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా వేసుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారని.. దీంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

తొలిసారి క్రెడిట్‌ కార్డు (Credit Card) తీసుకున్నప్పుడు బ్యాంకులు ‘ప్రవేశ స్థాయి ప్రయోజనాలు’ ఉన్న కార్డుని అందజేస్తాయి. ఇవి మీ క్రెడిట్‌ ప్రయాణాన్ని ప్రారంభించడానికి అనువుగా ఉంటాయి. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ప్రయాణ రాయితీలు, లాంజ్‌ అనుమతి.. వంటి ఆకర్షణీయ ప్రయోజనాలను అందజేయవు. సమయం గడిచే కొద్దీ మీ ఆదాయం పెరుగుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా కేసులు పెరుగుతున్నాయ్‌.. తాజాగా ఎన్నంటే..?

గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా వైరస్(Coronavirus) ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆరువేల మంది వైరస్ బారినపడ్డారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. కొత్తగా ౧,౭౮,౫౩౩ మందికి కొవిడ్ (చొవిద్ ౧౯) నిర్ధారణ పరీక్షలు చేయగా.. ౬,౦౫౦ మందికి వైరస్ సోకిందని కేంద్రం వెల్లడించింది. ముందురోజు కంటే ౧౩ శాతం మేర పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్ ౧౬ తర్వాత మొదటిసారి కేసులు ఐదు వేల మార్కు దాటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కేకేఆర్‌ యువ స్పిన్నర్‌ సుయాశ్‌పై ఏబీడీ ప్రశంసల జల్లు

కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR) యువ స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌(ABD) ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌-16 (IPL)లో గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు  చేసింది. తమ స్పిన్‌తో బెంగళూరును కట్టడి చేసిన సుయాశ్‌ శర్మ(Suyash Sharma), సునీల్‌ నరైన్‌(Suniel Narain)ల ప్రదర్శనను ఏబీడీ అభినందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా రహస్య ప్లాన్‌ లీక్‌..!

వేసవిలో రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌(Ukraine)కు అమెరికా(USA), నాటో (NATO)దేశాలు ఎటువంటి సాయం చేయాలో క్షుణ్ణంగా సిద్ధం చేసిన ప్రణాళిక లీకైంది. ఇది ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా (USA) పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ భద్రతా వైఫల్యాన్ని తాము పరిశీలిస్తున్నమని పెంటగాన్‌ వెల్లడించింది. ‘‘మాకు ఆ సోషల్‌ మీడియా పోస్టుల విషయం తెలుసు. ఈ విషయాన్ని మా శాఖ విశ్లేషిస్తోంది’’ అని పెంటగాన్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ సబ్రీనా సింగ్‌ వివరణ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రివ్యూ: రావ‌ణాసుర‌

వ‌రుస విజ‌యాల‌తో జోరు ప్రదర్శిస్తున్న క‌థానాయ‌కుడు ర‌వితేజ‌ (Ravi teja). ‘ధ‌మాకా’, ‘వాల్తేరు వీర‌య్య’ త‌ర్వాత ర‌వితేజ చేసిన మ‌రో చిత్రం ‘రావ‌ణాసుర‌’. ఐదుగురు కథానాయిక‌లు... నెగిటివ్ టైటిల్‌తో ఆస‌క్తిని రేకెత్తించింది. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మ‌రిన్ని  అంచ‌నాల్ని పెంచాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? (Ravanasura review) ర‌వితేజ విజ‌య ప‌రంప‌ర‌ని కొన‌సాగించే చిత్రం అవుతుందా లేదా?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని