IPL 2023: కేకేఆర్‌ యువ స్పిన్నర్‌ సుయాశ్‌పై ఏబీడీ ప్రశంసల జల్లు

తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న కేకేఆర్‌ యువ స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మపై ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు.

Published : 07 Apr 2023 11:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR) యువ స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌(ABD) ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌-16 (IPL)లో గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు  చేసింది. తమ స్పిన్‌తో బెంగళూరును కట్టడి చేసిన సుయాశ్‌ శర్మ(Suyash Sharma), సునీల్‌ నరైన్‌(Suniel Narain)ల ప్రదర్శనను ఏబీడీ అభినందించాడు. 

‘‘సుయాశ్‌ గురించి గతంలో నాకు తెలియదు. కానీ, గురువారం జరిగిన మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ నన్ను చాలా ఆకట్టుకుంది. భవిష్యత్తులో అతడు కూడా ఒత్తిడికి గురయ్యే సమయం వస్తుంది. అప్పుడు అతడు దానిని అధిగమించి ఎలా రాణిస్తాడో చూడాలని ఉంది. ఆ మ్యాచ్‌లో అతడు నిజంగా మా (ఆర్సీబీ) ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెట్టాడు. తొలుత వరుణ్ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ల వల్లే ఆర్సీబీకి ఎక్కువ నష్టం జరిగింది. కానీ, ఎక్కువ క్రెడిట్‌ సుయాశ్‌కు దక్కుతుంది. ఇంతపెద్ద టోర్నమెంట్లో అనుభవం లేకపోయినా అతడు తన సత్తా ఏమిటో చూపించాడు’’ అని ప్రశంసించాడు. 

ఐపీఎల్ మినీ వేలంలో సుయాశ్‌ను కేకేఆర్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. దిల్లీకి చెందిన ఈ యువ స్పిన్నర్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌కు బదులు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దినేశ్‌ కార్తీక్‌, అనుజ్‌ రావత్‌, కర్ణశర్మలను అవుట్‌ చేశాడు.

ఇక వెటెరన్‌ ఆటగాడు సునీల్‌నరైన్‌ను ప్రత్యేకంగా అభినందించాడు ఏబీడీ. ‘‘అతడు అద్భుతమైన ఆటగాడు. తన ఆఫ్‌స్పిన్‌తో విరాట్‌కోహ్లీని కట్టడి చేశాడు.  అతడి బౌలింగ్‌లో విరాట్‌ చాలా ఇబ్బందిపడ్డాడు. ఆ భారీ వికెట్‌ కేకేఆర్‌ విజయానికి ఊతమిచ్చింది’’ అని పేర్కొన్నాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని